వయ్యారి నీ హంస నడకలతో వెన్నెలనే చోరీ చోరి లోలో
అయ్యారే నీ అంద చెందములతో మేనకనే చోరీ చోరి
వయ్యారి నీ హంస నడకలతో వెన్నెలనే చోరీ చోరి
అయ్యారే నీ అంద చెందములతో మేనకనే చోరీ చోరి
దొంగగా మారిపోయి నీ మనసునే చేయాలి చోరీ చోరి
పరదాగా కట్టుకోగా నీ పెదాలనే కోరాలి చోరీ చోరి
సరదాగా ముట్టుకోగా నీ పాదాల స్పర్శనే చోరీ చోరి
ఎదురుగా నువ్వుండుగా నీ చూపుల కనులనే చోరీ చోరి
అందంగా అద్దుకోగా నీ ముఖ సౌందర్యాన్నే చోరీ చోరి
కోరెనుగా నలుగుగా నీ నడుము వంపునే చోరీ చోరి
వయ్యారి నీ హంస నడకలతో వెన్నెలనే చోరీ చోరి
అయ్యారే నీ అంద చెందములతో మేనకనే చోరీ చోరి
ఆగనుగా అలసిపోయి ముడివేయగా నీ కురులునే చోరీ చోరి
చేరనుగా సొలసిపోయి జతగా నీ కను పాపలనే చోరీ చోరి
మారనుగా మరచిపోయి మధురంగా నీ చేతి కలయికనే చోరీ చోరి
కాదనగా కలిసిపోయి అదరంగా నీ కౌగిలింతనే చోరీ చోరి
వాదనగా విసిగిపోయి వివరముగ నీ వినయపు వలపునే చోరీ చోరి
వేదనగా వదిలిపోయి వాస్తవముగా నీ వసంత వాయువే చోరీ చోరి
వయ్యారి నీ హంస నడకలతో వెన్నెలనే చోరీ చోరి
అయ్యారే నీ అంద చెందములతో మేనకనే చోరీ చోరి