ఎటు వైపు వెళ్తున్నా నీ వైపు వస్తున్నా o
ఎదుట ఎవరున్నా నీ కోసం చూస్తున్నా
ఎటు వైపు వెళ్తున్నా నీ వైపు వస్తున్నా
ఎదుట ఎవరున్నా నీ కోసం చూస్తున్నా
జాబిల్లి చూపిస్తూ అమ్మ గోరుముద్ద పెడుతుందే
జాబిల్లి లాంటి నిన్ను చూస్తే అందమే గగ్గోలు పెడుతుందే
చుక్కల్ని లెక్కిస్తూ అమ్మమ్మ కథల్ని చెబుతుందే
చుక్కల లాంటి నీ చెక్కిలినే చూసి సంద్రమే అసూయ పడుతుందే
సూర్యోదయం చూపిస్తూ నాన్న లోకాన్ని పరిచయం చేస్తాడే
సూర్య కిరణం లాంటి నీ చూపుతో సూర్యుడ్ని కూడా దాచేస్తావే
ఎటు వైపు వెళ్తున్నా నీ వైపు వస్తున్నా
ఎదుట ఎవరున్నా నీ కోసం చూస్తున్నా
ఎటు వైపు వెళ్తున్నా నీ వైపు వస్తున్నా
ఎదుట ఎవరున్నా నీ కోసం చూస్తున్నా
ఆకాశానికి మేఘానికి మధ్య దూరం కనపడదే
నీ అందానికి నా అర్హతకి చాలా వైరం పెరిగిందే
భూమిలో ఎక్కువ భాగం జలాశయ మయమే
నాలో సగభాగం నీవని తలచి చేస్తున్న పయనమే
ఉదయానికి సాయంత్రానికి మధ్యలో రాత్రి పగలే
ముహూర్తానికి మాంగల్యానికి ప్రతిఫలం ఆలు మగలే
ఎటు వైపు వెళ్తున్నా నీ వైపు వస్తున్నా
ఎదుట ఎవరున్నా నీ కోసం చూస్తున్నా
ఎటు వైపు వెళ్తున్నా నీ వైపు వస్తున్నా
ఎదుట ఎవరున్నా నీ కోసం చూస్తున్నా