క్షణమేనా నా పై నీ ప్రేమ నే యుగమే అడిగినా
కలయేనా నీ పై నా ప్రేమ నీ జతగా నడవనా
క్షణమేనా నా పై నీ ప్రేమ నే యుగమే అడిగినా
కలయేనా నీ పై నా ప్రేమ నీ జతగా నడవనా
నడచి నడచి అలసిపోయాను నీ జాడలో నీడనై
వేచి వేచి వదిలేసాను నీ ప్రేమలో పగనై
మరచి మరచి మిగిలిపోయాను నీ కోరల్లో విషమై
కోరి కోరి కరిగిపోయాను నీ కష్టాల్లో కన్నీరై
తలచి తలచి పారిపోయాను నీ కోణంలో ప్రశ్ననై
గెలిచి గెలిచి ఓడిపోయాను నీ కంటిలో బొట్టునై
వెతికి వెతికి విసిగిపోయాను నీ మనసులో ప్రేమనై
కొలిచి కొలిచి కుమిలిపోయాను నీ భ్రమలో జతనై
తడిచి తడిచి తెలియకపోయెను నీ వలలో బంధీనై
ఏరి ఏరి ఎరనయ్యాను నీ మాయలో మంత్రమై
తడిచి తడిచి తెలియకపోయెను నీ వలలో బంధీనై
ఏరి ఏరి ఎరనయ్యాను నీ మాయలో మంత్రమై