వింటుంటే ఉదయపు సుప్రభాతం
చూస్తుంటే కనులకు సుస్వాగతం
వింటుంటే ఉదయపు సుప్రభాతం
చూస్తుంటే కనులకు సుస్వాగతం
మరువనే సాయంత్రపు కాలక్షేపం
నడవవే ఏడడుగులు పెళ్ళికి క్షేత్రం
నలిగినే హృదయపు అంతర్మధనం
మెరిసినే మౌనపు మేలిమి స్వర్ణం
కదిలినే కుందనపు బొమ్మల పర్వం
వింటుంటే ఉదయపు సుప్రభాతం
చూస్తుంటే కనులకు సుస్వాగతం
జత నువ్వే జయంబు పలికెను ధైర్యం
సరి నువ్వే సహాయము అడగని స్నేహం
బ్రతుకు నువ్వే మరణము లేనిది స్వప్నం
అడుగు నువ్వే ఋణము తీర్చని వరం
చితి నువ్వే జననము ఇచ్చిన వాడి ధర్మం
వింటుంటే ఉదయపు సుప్రభాతం
చూస్తుంటే కనులకు సుస్వాగతం