నీ పేరే గుండెల్లో పచ్చబొట్టుగా వేశానే
చచ్చేంత ప్రేముందే నచ్చినట్టుగా చూడవే
నీ పేరే గుండెల్లో పచ్చబొట్టుగా వేశానే
చచ్చేంత ప్రేముందే నచ్చినట్టుగా చూడవే
అమ్మ నాన్న అడిగారే ఆ అమ్మాయే ఎందుకని
వాళ్ళకి ఒక్కటే చెప్పానే ఆ అమ్మాయే నా ప్రాణమని
అడుగు అడుగు నడవాలె నీ అడుగులె అందమని
వేడుక వేడుక జరగాలే మన ఏడడుగుల బంధమని
వేడుక వేడుక జరగాలే మన ఏడడుగుల బంధమని
ప్రాణస్నేహితులు ఎందరో ఉన్నారే ప్రాణం మాత్రం నీతోని
జీవన ప్రమాణాలు ఎన్నున్నా జీవన ప్రయాణం మాత్రం నీతోని
నీ పేరే గుండెల్లో పచ్చబొట్టుగా వేశానే
చచ్చేంత ప్రేముందే నచ్చినట్టుగా చూడవే
అంతంత మాత్రమే అందరూ కానరాగా అనిపించింది నువ్వే అద్భుతమని
చింతంత కష్టమే చెంత చేరకుండా చూడాలనివుంది నిన్నే నా జీవితమని
గుప్పెడంత మనసే కష్టమందిగా ఇష్టమైన ప్రేమని నిన్నే కురిపించమని