నవ యువతా...యువ చరితా...మానుకో దుర్వ్యసనం...
మార్చుకో నీ గమ్యం...
నవ యువతా...యువ చరితా...మానుకో దుర్వ్యసనం... మార్చుకో నీ గమ్యం...
నువ్వెంతో ఎదగాలనీ...చదువెంతో చదవాలనీ
నువ్వెంతో పెరగాలనీ..పేరెంతో తేవాలనీ...
నువ్వెంతో సాధించాలనీ..విలువతో వెలగాలనీ..
కలలెన్నో కన్నది మీ అమ్మ..మురిపెంగ పెంచింది మీ అమ్మ..
ఆ అమ్మ ఆశలన్నీ కూల్చేస్తూ... దుష్ట సావాసం చేశావా..
దుర్మార్గుడిగా మారావా..
నవ యువతా...యువ చరితా...మానుకో దుర్వ్యసనం..
మార్చుకో నీ గమ్యం...
నువ్వెంతో మంచోడివనీ..బుద్ధిశాలివనీ..
నువ్వెంతో గొప్పోడివనీ.. గుణశీలివనీ...
నువ్వెంతో వీరుడవనీ..వినయశీలివని..
కథలెన్నో తలిచాడు మీ నాన్న..గారాబంగా పెంచాడు మీ నాన్న...
ఆ నాన్న నమ్మకాన్ని వంచిస్తూ...మోహపుబాటలో తిరిగావా..మోసగాడివై మిగిలావా...
నవ యువతా...యువ చరితా...మానుకో దుర్వ్యసనం.. మార్చుకో నీ గమ్యం..