వందనం..వందనం..అభివందనం..విశాఖ రేవు వీరులకు కళాభివందనం..
సరుకు రవాణాలో అగ్రగామియై నిలిచి..
వాణిజ్య విపణిలో మార్గదర్శియై నడచి..
లక్ష్యాన్ని ఛేదించుటలో విజయాలు సాధించి..
ప్రథమంగా విశాఖ రేవును నిలబెట్టిన కార్మిక వీరులకు ..
వందనం..వందనం..అభివందనం..విశాఖ రేవు వీరులకు కళాభివందనం..
ప్రమాదాల నివారణలో నిరంతరం శ్రమించి..
రక్షిత పరికరాలు ఎల్లవేళలా అందించి..
కార్మిక సంక్షేమమే ప్రథమకర్తవ్యమని భావించే..అధికారులకు..
వందనం..వందనం..అభివందనం..విశాఖ రేవు వీరులకు కళాభివందనం..
కాలుష్య నివారణకై చర్యలెన్నో చేపట్టి..
పచ్చదనం పెంపుకై చెట్టులెన్నో నాటించి..
పరిసరాల పరిశుభ్రతకై నిధులెన్నో వెచ్చించి..
పర్యావరణ పరిరక్షణయే ప్రథమకర్తవ్యమని కృషిచేసే..ఉన్నతాధికారులకు..
వందనం..వందనం..అభివందనం..
విశాఖ రేవు వీరులకు కళాభివందనం..