నవ యువతా...యువ చరితా...ఏమిటీ మారణం...ఎందుకీ పతనం..
నవ యువతా...యువ చరితా...ఏమిటీ మారణం...ఎందుకీ పతనం..
నా బిడ్డ ఎదగాలనీ..మంచి చదవుకోవాలనీ..
నా చిట్టి పెరగాలనీ..మంచి పేరు తెచ్చుకోవాలనీ..
నా చిన్ని మెరవాలనీ..మంచి పదవి చేపట్టాలని..
కలలెన్నో కన్నది నీ తల్లి..మురిసిపోయి ముద్దులాడింది
పిచ్చితల్లి...
ఆ తల్లి ఆశలన్నీ కూల్చేస్తూ...దుర్వసనాలు మరిగేవా..
చెడుతోవలో నడిచావా...
నవ యువతా...యువ చరితా...ఏమిటీ మారణం...ఎందుకీ పతనం..
నా బాబు మంచోడనీ..తెలివైన వాడనీ..
నా బుజ్జి గొప్పోడనీ.. గుణవంతుడనీ..
నా కన్నా వీరుడనీ..నన్నెంతో ఉద్ధరిస్తాడనీ..
గర్వంగా చాటాడు నీ తండ్రి ...ముద్దుచేసి లాలించాడు వెర్రితండ్రి..
ఆ తండ్రి నమ్మకాన్ని వంచిస్తూ...మోహపువలలో చిక్కావా...మోసగాడివై మిగిలావా...
నవ యువతా...యువ చరితా...ఏమిటీ మారణం...ఎందుకీ పతనం..