తెలుగు మాట వినరా.....తెలుగు పాట పాడరా....
తెలుగు మాటలాడ.....తెలుగు పాట పాడ....
హృదయమే....పొంగురా.....ఆనందమే.... నింపురా....
రాగాల తోటలో....మేఘాలు కురిసినా.....కవితల జల్లె తెలుగురా....
భావాల పూదోట....పూచిన పూలకు...రంగులె అద్దెను....తెలుగురా....
నీ తోడు నీడై.....నీ వెంట తానై....కడవరకు నిలుచురా....

నీ శ్వాసలోన...నీ ఊసులోన....పలికించు భావమే....తెలుగురా......
తెలుగు మాట వినరా.....తెలుగు పాట పాడరా....
తెలుగు మాటలాడ.....తెలుగు పాట పాడ.....
హృదయమే....పొంగురా.....ఆనందమే.... నింపురా....
తెలుగు మాట వినరా.....తెలుగు పాట పాడరా....
ఏకాంతవేళ....నీలోన నువ్వే.....పాడిన పాటే....తెలుగురా...
మధురానుభూతి....గుండెను తాకి...ఒడలంత ప్రాకి....పరవశమొందేను...పాటగా....
పాడింది.... చైతన్య గీతిక... ప్రవహించె...పరువాల నాయికా....

తెలుగు... నీ ఇంట వెలుగుఉ నింపెను హాయిగా....