ఏ తీరమైనా ఎదురుచూస్తుంది నీ నడకలకూ...
ఏ హృదయమైనా ఎగసిపడుతుంది నీ అడుగులకకూ..
ఆదిలో వేదమై అక్షరించావే..
అంతటా నీవుగా అవతరించావే..
తలచినా... వలచినా.... నిన్నే నేస్తమా..
గెలిచినా.. ఓడినా... నీతోనే ప్రియతమా...
వెన్నెల్లో ఆడపిల్లవో.. వెండి కొండల్లో తేనెజల్లువో
నండూరి వారి ఎంకివో.. నువ్వు ఆ బాపు కొంటె గీతవో
తారలే తరుణిగా.. నేల దిగి వచ్చేనా...
ఎంత కళ నీలో ఆ బ్రహ్మ చెక్కాడమ్మా...
వెన్నెల్లో ఆడపిల్లవో.. వెండి కొండల్లో తేనే జల్లువో
నండూరి వారి ఎంకి వో.. నువ్వు ఆ బాపు కొంటె గీతవో..
సిరిమువ్వ సవ్వడి నీ నవ్వులో చిలికి
శిల కూడ కరిగిందే నీ చూపు తాకీ..
గోదావరి అలలు జడలోన మెరిసీ
సింగారమే తాను బుగ్గ సిగ్గాయే...
ముత్యాల పల్లకిలో ఊరేగు కొమ్మా..
ముత్యాలపల్లకిలో ఊరేగు కొమ్మా
నా కళ్ళలో నిలిచే బంగారు బొమ్మా..
వెన్నెల్లో ఆడపిల్లవో
వెండి కొండల్లో తేనె జల్లువో...
నండూరి వారి ఎంకివో నువ్వు ఆ బాపు కొంటె గీతవో..
కవనమై కదిలావు నా మనసులో
కావ్యమై విరిశావే గుండె లోతుల్లో..
ఏడు రంగుల విల్లు కంటి రెప్పల్లో
ఎన్నెన్నో రాగాలూ నీ గొంతు సడిలో..
కదిలేటి శిల్పం.. కన్నె గాంధారం..
కదిలేటి శిల్పం కన్నె గాంధారం
ఎద వీణ మీటగా ఎందుకే మౌనం..
వెన్నెల్లో ఆడపిల్లవో
వెండి కొండల్లో తేనే జల్లువో
నండూరి వారి ఎంకివో
నువ్వు ఆ బాపు కొంటె గీతవో...
.....
.....