:పంచభూతాలే పబ్బతి పడుతున్నవి
వినరో ఓనరుడా 2
పచ్చని వనాలే పతనమాయేనని
గోదరిల్లె మానవుడా 2
- వనమహోత్సవానికి ఆజ్యము పోయాలన్నవి
-- జనాలు మొక్కలునాటి మోక్ష్యo పొందాలన్నవి . |పంచభూతాలే ||
1చ.భూగోళమే అగ్నిగోళమై
భూకంపాలొచ్చే
భువనంపైన అటవీ సంపదలు
అంతరించిపోయే
భవనాల నిర్మాణంకై చెట్ల
మానుకోషాము
దర్వాజ బాజులు కిటికీ
తలుపులు పెట్టుకున్నాం
- భోధి వృక్షము వటవృక్షాల విజ్ఞానమెరుగలేదా
-- బోధన చేసిన తాళ్లపత్ర గ్రంథాల ఘనత కనలేద
||పంచభూతాలే//
2చ.సర్వరోగ నివారణ సూత్రము
పచ్చని చెట్లేరా
సకల ప్రాణుల ఆయురారోగ్యాలను
కాపాడరా స్వార్థంతో చెట్లేన్నో నరికిన
సంగతి మరిచారా
కోటి జీవరాశులకు ఆశ్రయమే
అడవులురా 2 -
– సహనంతో మన క్షేమాన్నే
కోరుతుంటాయిరా
సతతం హరితం సుభిక్షమంటూ
మొక్కలునాటాలిరా
|| పంచ భూతాలే ||
3చ.కోట్ల మొక్కలు నాటి పెంచుతూ
వన జీవులమౌదాము
కల్పతరువులను కాపాడి
కరువుల తరుముదము 2
మర్రి,మామిడి,మేడి,రావి,
కొమ్మలతో యజ్ఞాలే
మట్టికి మనిషికి మధ్యన
వారధి ఎదిగిన వృక్షాలే 2
- వృక్షార్చనలో మనమే నేను సైతమనాలే
-- కొలువు దీరాలి వన దేవతలే వరాలనందించాలే