మబ్బులో దాగిన చందమామ లా ~
నా వంక చూపు మరిచినా సరిగా ~
నీకోసమే తపించే గుండెనా ~
ఓ ప్రేమా నా హేమా ~~~
నీతో పరిచయం కలలో ఊహించని కథా ~
నీతో ఈ బంధం నేనూ ఎరగని గమ్యా ~
నీ వల్ల పొందిన ఈ నవ్వు ఆజన్మాంతం నిలుస్తుంది ~
నీ వెంట నడవలేను తెలిసినా గుండె తపన కొనసాగుతుంది ~
మాటల్లో వర్ణించలేని కాంతి నువ్వే ~
నీలో సగం నేనుకాని నిజం తెలిసినా ~
కోరే నీవే, కోరే ఈ గుండె ~
జాలి, దయ, కరుణ నాలో మిగిలిపోని ~
జీవితం అనే పుస్తకం పుటలు మారినా ~
ఎన్ని అచ్చు తప్పులైనా గుండెలో నిలుస్తాయి ~
మరిచిపోవడం కాదు, గుర్తులు చెరగవు ~
నువ్వు గుర్తురాని క్షణమే లేదు, నువ్వే ఊపిరి ~
కష్టం కన్నీరు కాదు, ధైర్యం చూపిస్తే గెలుస్తుంది ~
కష్టానికి పరిష్కారం వెతికే మనసే నిజం మారుస్తుంది ~
తట్టిన ప్రతి అక్షరం పాఠం కాలేదని తెలిసినా ~
ప్రతి కల నిజం కాదని తెలిసినా, నువ్వు కలగా నిలుస్తావు ~
కనుల చూపులో కలల పూవు నువ్వే ~
నవ్వుతో నా లోకం మార్చినది నువ్వే ~
మాటలతో గుండెని మాయ చేసినది నువ్వే ~
వెన్నెలకే అసూయ కలిగే అందం నువ్వే ~
పూలకు తలవంచే సుగంధం నీ ఊపిరిలో ~
గుండె తాళాలు నీకోసమే తెరిచాయి ~
కోటిరాగాలు నీకోసమే పలికాయి ~
చందమామ పిలిచేది నిన్నే ~
నా కన్ను ఎదురు చూసేది నిన్నే ~
నువ్వే కల, నువ్వే కల్పన ~
ఓ ప్రేమా ~~ నా హేమా ~~~~,