సిఐటియు జెండా కింద ఆర్డీటి అండగా!
RDT రక్షణ – ప్రజా హక్కులను కాపాడుకుందాం
ఎర్రజెండా ఎగురుతోంది… పోరాటం మోగుతోంది!
సిఐటియు గర్జనతో… అనంతపురం లేచింది!
ఆర్డీటిని కాపాడుదాం… ప్రజల హక్కు సాధిద్దాం!
ఎఫ్ సి ఆర్ ఎ బంధాలు… చీల్చి ముందుకు సాగుదాం!
కరువు నేలలో కన్నీటి కథ…
వలస బాటలో బాధల పథ…
అలాంటి వేళలో వెలుగై నిలిచింది…
ఆర్డీటి సేవలే ఆశల దీపం
స్పెయిన్ నేల నుంచి సేవా దీక్ష…
విసెంటే ఫెరర్ అడుగులు ఆశల దీపం!
అవమానాలు తట్టుకుని నిలిచింది…
అనంతపురం భవిష్యత్తు మార్చింది!
ఎర్రజెండా ఎగురుతోంది… పోరాటం మోగుతోంది!
సిఐటియు గర్జనతో…
అనంతపురం లేచింది!
బడి లేని ఊరికి పాఠశాల…
ఆసుపత్రి లేని చోట ప్రాణ దాత
రైతు పొలంలో నీటి చుక్క…
మహిళ చేతిలో ఆత్మగౌరవ శక్తి!
విద్య, వైద్యం,
గృహ నిర్మాణం…
వికలాంగులకు జీవన గౌరవం!
గ్రామీణ యువతకు ఉపాధి దారి…
ఆర్డీటి సేవలే ప్రజల బలగం!
ఆర్డీటిని. కాపాడుదాం…
ప్రజల హక్కు సాధిద్దాం!
ఎఫ్ సి ఆర్ ఎ బంధాలు… చీల్చి ముందుకు సాగుదాం!
కార్మికుడి చెమటే దేశ సంపద…
దానిపై దాడి చేస్తే మౌనం లేదు! మౌనం ఇక లేదు పోరాటమే
ఎఫ్సిఆర్ఎ పేరుతో బంధాలు వేస్తే…
సిఐటియు గర్జన పోరాట గర్జన ఇక ఆగదు!
మోదీ ప్రభుత్వం వినాలి మా మాట…
వినాలి మా మాట
ప్రజా సేవలపై ఎందుకీ గోడ ఎందుకు అడ్డగోడ
నిధుల మార్గం తెరవాలి వెంటనే…
లేకపోతే పోరాటం జ్వాలలే! ఇక ప్రజా కార్మిక పోరాట జ్వాలలే ఎర్రజెండాలై ఎగురుతాయి
ఎర్రజెండా ఎగురుతోంది… పోరాటం మోగుతోంది!
సిఐటియు గర్జనతో… అనంతపురం లేచింది!
ఏడు నుంచి. పదహారు… వరకు సమరభేరి! మోగుతోంది ఇక మోగుతుంది
గ్రామం నుంచి పట్టణం వరకు జైకొడదాం!
జై కొడుతూ కదులుదాం
కెవి పి ఎస్, ఐ ద్వా, రై తు, వ్యవసాయ కార్మిక…
డి వై ఎఫ్ ఐ, ఎన్పీ ఆర్డి…
అందరం తోడుగా!
ఎర్రజెండా చేతిలో… ఐక్య నినాదం!
అనంతపురం గుండెలో ప్రజా ప్రతిజ్ఞ!
ఆర్డీటిని రక్షించడం అంటే…
జిల్లా భవిష్యత్తును కాపాడటం!
సిఐటియు జెండా కింద… సమరం సాగుదాం!
ఆర్డీటి కి అండగా… ప్రజల కోసం నిలుద్దాం!
ఎఫ్ సి ఆర్ఎ పునరుద్ధరణ… వెంటనే సాధిద్దాం!
అనంతపురం గౌరవం… ఐక్యంగా కాపాడుకుందాం కాపాడుద్దాం!!
ఎర్రజెండా ఐక్యత వర్ధిల్లాలి ఎర్రజెండా ఐక్యత వర్ధిల్లాలి కదలండి ఇక కదలండి ఆర్డిటిని కాపాడుకుందాం ఇక కాపాడుకుందాం