ఓ మనిషీ ఎంత నీ బ్రతుకు
ఎగిరెగిరి పడతావెందుకు,
నువ్వస్తూ ఏమీ తేలేదు, పోతూ తీసుకు పోలేవు
ఐనా అంతా నాదంటూ విర్రవీగుతావు.
ఓ మనిషీ ఎంత నీ బ్రతుకు
ఎగిరెగిరి పడతావెందుకు,
నువు నడిచే నేల... పీల్చే గాలి... తాగే నీరు, నువు ప్రేమించే ఊరు.
ఎవరిచ్చారు ఇవన్నీ నీకు,
ప్రకృతి పెట్టిన బిక్షని మరువకు.
ఓ మనిషీ ఎంత నీ బ్రతుకు
ఎగిరెగిరి పడతావెందుకు.
సూర్యుని కిరణం... తాకకుండ...
నల్లని మేఘం వర్శించకుండా...
పుడమి తల్లి పులకింఛేనా, పసిడి పంటలే పండేనా,
నీ ఆటలే తీరేనా, నీ ఊపిరే నిలిచేనా.
ఓ మనిషీ ఎంత నీ బ్రతుకు
ఎగిరెగిరి పడతావెందుకు.
ఉప్పొంగే నదిని శాంతింపగలవా...
రగిలే బడబాగ్ని చల్లార్చ గలవా...
ప్రకృతి కన్నెర జేసిందా, బ్రతుకు పయణమే ఆగేనే, నీ కలల సౌధమే కూలేనే.
ఓ మనిషీ ఎంత నీ బ్రతుకు
ఎగిరెగిరి పడతావెందుకు.
నువు పుట్టే నాడు నీకు తెలుసా...
నీ అంతిమ యాత్ర నువు చూడగలవా...
పుట్టకతో మొదలయ్యే ఆట మరణంతోనే ముగిసేను,
మద్య మూన్నాళ్ళ ముచ్చటకే మిడిసి మిడిసి పడుతుంటావు.
ఓ మనిషీ ఎంత నీ బ్రతుకు
ఎగిరెగిరి పడతావెందుకు,
నువ్వస్తూ ఏమీ తేలేదు, పోతూ తీసుకు పోలేవు
ఐనా అంతా నాదంటూ విర్రవీగుతావు.