హే హే హే జమకుజమ
హే హే చదవేస్తే వున్నమతి పోతుందట నిజమా
హే హే హే డింగుటక
హే హే వున్న నిజం తెలుసుకో విర్రవీగక
హేహే మనిషివన్న మాట మర్చిపోవద్దు
హేహేహేయ్ మానవత్వం ఎప్పుడూ వదలొద్దు
కులాలు కులాలు కులాలు
ఈ కుమ్ములాటలో
గంగలో కలిసిపోయే గుణాలు
ఆనవాళ్లు కూడా దొరకని సుగుణాలు
ఆరారగా తింటూ వస్తున్నావే
ఏళ్ల తరబడి
ఆ రైతు కులం ఎప్పుడైనా అడిగావా?
నోరారా తింటున్నావే కూరలు
తరాలుగా ఎగబడి
నారుపోసి నీరుపోసినోడి
మతం ఏమైఉంటుందో
ఆలోచించావా?
వీటన్నిటికీ ఆలోచించని కులం మతం
అనవసరమైన విషయాల్లో
పొంగుకొస్తుంది ఏం ? ఏం? ఏం ?
.................ఏం.....................
దర్జాగా కూర్చుని పోతున్నావే బస్సులో
డ్రైవర్ మనోడేనా అని కనుక్కున్నావా?
క్షేమంగా దించాడు నీ కులం కనుక్కోకుండా
ఆటో అన్నది ఏ కులమో
ఎప్పుడైనా కనుక్కుని ఎక్కావా?
టైముకి దింపుతాడు నీ మతంతో పనిలేదు తనకి
వీటన్నిటికీ ఆలోచించని కులం మతం
అనవసరమైన విషయాల్లో
పొంగుకొస్తుంది ఏం ? ఏం? ఏం ?
.................ఏం.....................
సందేహాలు కొన్ని తీరుస్తావా?
తీర్చలేక మొహం చాటేస్తావా?
చావుబతుకుల్లో రక్తం ఎక్కించుకుంటారే
ఆ రక్తం ఏ కులపోడిది అని
లోకంలో ఎవ్వడైనా ఎప్పుడైనా
అడిగాడా?
అవసరానికి ఆదుకునేవాడు
అప్పు ఇచ్చేవాడు
ఈడు మనోడేనా అని కులం చూసి
మానుకున్నోడు
సమాజంలో ఎవడైనా ఉన్నాడా?
వీటన్నిటికీ ఆలోచించని కులం మతం
అనవసరమైన విషయాల్లో
పొంగుకొస్తుంది ఏం ? ఏం? ఏం ?
.................ఏం.....................
సమాధానం నేను చెప్పనా
కొంచం నిష్కర్షగా చెబుతా
ఫీల్ కాకు
వాడుకు దొబ్బటానికి ఎవడైనా పర్లేదు
వ్యవహారానికి మాత్రం కులం మతం కావాలి
తప్పు కదూ
పచ్చి స్వార్ధానికి ఇది నిదర్శనం కదూ
హే హే హే జమకుజమ
హే హే చదవేస్తే వున్నమతి పోతుందట నిజమా
హే హే హే డింగుటక
హే హే వున్న నిజం తెలుసుకో విర్రవీగక
హేహే మనిషివన్న మాట మర్చిపోవద్దు
హేహేహేయ్ మానవత్వం ఎప్పుడూ వదలొద్దు
మనుషులందరూ ఒక్కటే
మనది మనిషి కులం
మన మతం మానవత్వం కావాలి
.. ....... ...సర్వేజనా సుఖినో భవంతు...............